అనంతపురం నగరంలో ఈ సీజన్లోనే అత్యధికంగా గురువారం 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 81 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిందని పేర్కొన్నారు. అలాగే, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు.