NZB: బోధన్ ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. 11 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు నాలుగు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలలో ఉంది.