టీమిండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్‌పై తాజాగా స్పందించాడు. ఆసియా కప్‌లో తాను పరుగులు రాబట్టలేకపోయినా, తన బ్యాటింగ్ బాగానే ఉందని సూర్య పేర్కొన్నాడు. తాను ఫామ్ కోల్పోలేదని, కేవలం పరుగులు మాత్రమే రావడం లేదని వివరణ ఇచ్చాడు. ప్రతి మ్యాచ్‌కు తాను ఒకే విధంగా సిద్ధమవుతానని, కొన్నిసార్లు పరుగులు చేయడంలో విఫలమవుతామని తెలిపాడు.