GNTR: గుంటూరు నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ జీఎస్టీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడంతో జీఎస్టీ తగ్గింపు, పండగల ఆఫర్ కలిసి వస్తువులపై ప్రజలకు అవగాహన వస్తుందన్నారు.