మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. విశాఖలోని ACA-VDCA స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, భారీ వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. దీంతో టాస్‌లో ఆలస్యం కానుంది. అంపైర్లు పిచ్‌ను పరిశీలించి, మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.