AKP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్‌ను రాష్ట్ర ఫుడ్ కమిటీ మెంబర్ బీ. కాంతారావు గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కలుషిత లేని పరిశుభ్రమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని తెలిపారు. డిప్యూటీ డీఈవో అప్పారావు ఉన్నారు.