E.G: సీతానగరం బ్లాక్–V డీ-కాస్టింగ్ ఇసుక రీచ్ పై ఏపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.కృష్ణ నాయక్ తెలిపారు. ఈ గ్రామ సభలో ప్రాజెక్టు వివరాలను ప్రజలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు, నీటి వినియోగ పరిమితులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.