EG: రాజానగరంలో ఈ.కే ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఇలాంటి వైద్య శిబిరాలు సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.