ప్రకాశం: ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గురువారం నగరపాలక సంస్థ అధికారులతో సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావులు సైతం పాల్గొన్నారు. కాగా నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్షించారు.