MBNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి గురువారం జడ్చర్ల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని నియమ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని ఆమె అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు.