E.G: రాజానగరం మండలం పాలచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ‘సూపర్ GST – సూపర్ సేవింగ్స్’పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల మందులు, వైద్య పరికరాలు, బీమా ప్రీమియంలపై పన్ను తగ్గడం ద్వారా ప్రజలకు గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతుందన్నారు. ప్రజలకు తక్కువ ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయన్నారు.