NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లో ఇవాళ జరిగిన నియోజకవర్గ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో జెడ్పీ ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డితో పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.