KNR: కొత్తపల్లి మండలం రేకుర్తి ఇందిరా నగర్ బుడగ జంగాల కాలనీలో గురువారం సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ప్రతి నిరుపేదకు ఇల్లు కల్పించడమే లక్ష్యమని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.