ప్రకాశం: ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెలిగండ్ల CIU నాయకులు మాలకొండయ్య అన్నారు. గురువారం ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తాసిల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన వాహన మిత్ర కార్యక్రమంలో, కొద్దిమందికి మాత్రమే డబ్బులు వచ్చాయని మిగతా వారికి వచ్చేలా చూడాలన్నారు.