MBNR: ముసాపేట మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆధార్ల్లో పేరు మార్పు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లింక్ వంటి సేవలు అందిస్తారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆపరేటర్ మనోహర్ తెలిపారు. ఆధార్ సందేహాలకు 95733 77660 నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.