కృష్ణా: నందివాడ హైస్కూల్ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లోడుతో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విద్యార్థులు, ప్రజలు సమీపంలో ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. టిప్పర్ బోల్తా పడటానికి కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.