UK పీఎం కీర్ స్టార్మర్తో భేటీ అయిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-యుకే వాణిజ్య భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని మోదీ పేర్కొన్నారు. ఇది యూకే నుంచి భారత్కు వచ్చిన అతిపెద్ద వాణిజ్య మిషన్ అని అభివర్ణించారు. ఈ ఏడాది జూలైలో కుదిరిన FTA గురించి స్టార్మర్ మాట్లాడుతూ.. ఇది EU నుంచి నిష్క్రమించాక తాము కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందమని తెలిపారు.