NTR: తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. అయన వెంట 19వ వార్డు కౌన్సిలర్ నూకల సాంబ దంపతులు పాల్గొన్నారు.