TG: దేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద సామాజిక విప్లవం అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్లాలి. ఓట్ చోరీ విషయంలో ఏఐసీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రతి గ్రామానికి 100 చొప్పున సంతకాల సేకరణ చేసి ఏఐసీసీకి పంపాలి’ అని పేర్కొన్నారు.