AP: నేడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. పారిశ్రామికరంగ దిగ్గజం, మానవతావాది రతన్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా దూరదృష్టి, విలువల పట్ల నిబద్ధత తరతరాలకు ప్రేరణగా నిలుస్తారని కొనియాడారు. కాగా, గతేడాది అక్టోబర్ 9న వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో రతన్ టాటా మరణించారు.