ప్రకాశం: పామూరులో దుకాణాదారులు అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించరాదని సీఐ భీమా నాయక్ హెచ్చరించారు. గురువారం డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకు పట్టణంలోని దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమంగా బాణాసంచా నిల్వ ఉన్నా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్సై సురేష్ సిబ్బంది ఉన్నారు.