SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు డ్యాంకు 1256 క్యూసెక్కుల వరద కొనసాగుతుందని గురువారం సంబంధిత ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493.42 అడుగుల వద్దకు చేరి అలుగు ద్వారా 1146 క్యూసెక్కులు దిగువకు పరవళ్ళు తొక్కుతోందని చెప్పారు. ఆయకట్టు రైతుల పంట సేద్యానికి కాలువల ద్వారా 110 క్యూసెక్కులు విడుదలవుతుందన్నారు.