AP: వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతు సేవా కేంద్రాలను రీ-ఓరియంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలని.. అన్నదాతలకు ప్రభుత్వ సేవల విషయంలో అవి కీలక పాత్ర పోషించాలని తెలిపారు. మంచి పోషక విలువల ద్వారా భూసారం పెంచాలని.. దాని ద్వారా ఉత్పాదకత పెంచాలన్నారు.