దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు తయారు చేసిన శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ చెన్నైలో అరెస్ట్ చేశారు. ఈ దగ్గు మందు తాగి ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 20 మంది పిల్లలు చనిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ల్యాబ్ రిపోర్టుల్లో ఈ మందు ప్రమాదకరమని రావడంతో, అన్ని రాష్ట్రాలు దీని వినియోగాన్ని నిషేధించాయి.