SGR: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సంగారెడ్డి డిపోకు రూ. 356.87 లక్షల ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డిపోలో అందరూ ఉద్యోగులు సమష్టిగా పని చేయడంతో పాటు ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపారు. 7,22,930 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారని తెలిపారు.