TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ‘ఈ ఎన్నికల్లో భారీగా ఆశావాహులు ఉన్నారు. కాబట్టి మీరు HYDలో సంబంధాల కోసం చక్కర్లు కొట్టి సమయం వృధా చేసుకోకండి. MPTC, ZPTCగా నిలబడాలనుకునే వారు ముందుగా స్థానిక నాయకత్వాన్ని సంప్రదించండి. అందరినీ గెలిపించుకునే బాధ్యత మా ఎంపీలు, MLAలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.