సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రాకేశ్ కిశోర్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే, ఆయన సుప్రీంకోర్టులోకి ప్రవేశించకుండా ఎంట్రీ కార్డును కూడా రద్దు చేసింది. బెంగళూరు బార్ అసోసియేషన్ ఫిర్యాదుతో ఆయనపై FIR కూడా నమోదైంది.