NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. గురువారం ప్రస్తుతం 59,774 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..16 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన, స్థానికంగా వర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్‌లోకి వరద తగ్గింది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. వరద గేట్ల ద్వారా 49,984 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతన్నారు.