మెదక్: చిలిపిచేడ్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి దొడ్ల నారాయణరెడ్డి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేసినా తనకు తగిన గౌరవం రాలేదని, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపు దక్కలేదని అన్నారు. అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరానని తెలిపారు.