W.G: ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం 19వ విడతగా 22 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఆరోగ్యపరమైన ఆసరాగా నిలబడుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.