NDL: డోన్ కొత్త బస్టాండ్లో తాగునీటి కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండులో ఉన్న ట్యాంకులు ఇతర అవసరాలకు వినియోగించడంతో కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలాయి. దీంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు తాగునీటి కోసం దుకాణాలకు వెళ్లి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.