ASR: హుకుంపేట మండలంలోని జర్రకొండ పంచాయతీకి పంచాయతీ భవనం మంజూరైందని వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, పీఆర్ ఏఈ శెట్టి సంజీవరావు తెలిపారు. గురువారం స్థానిక సర్పంచ్ కొర్రా చిట్టిబాబుతో కలిసి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. జర్రకొండ ప్రాంతానికి పంచాయతీ భవనంతో పాటు రహదారి కూడా మంజూరు చేసి వెంటనే నిర్మాణం చేపట్టాలని వైస్ ఎంపీపీ ప్రభుత్వాన్ని కోరారు.