MNCL: RTC టికెట్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ బస్ భవన్ ముట్టడికి బయలుదేరుతున్న BRS శ్రేణులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి అరెస్ట్లు చేయిస్తోందని పట్టణ యూత్ అధ్యక్షుడు అరుణ్ మండిపడ్డారు. ఉచిత బస్ పేరుతో మహిళల కుటుంబీకుల నుంచి కాంగ్రెస్ డబ్బులు దండుకుంటోందన్నారు.