HYD: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు టికెట్ కేటాయించటంతో మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.