MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాల ప్రజలకు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పీఎం జెన్మాన్ సంచార వైద్యులు డాక్టర్ ఆదిత్య కుమార్ అవగాహన కల్పించారు. గురువారం ఆయన జన్నారంలోని వరద బాధితుల కాలనీ, తపాలాపూర్ అనుబంధ కొలాంగూడ గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ ఉన్నారు.