జగిత్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలుర కబడ్డీ టోర్నమెంట్లో గొల్లపల్లి జట్టు విజేతగా నిలిచింది. పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు జిల్లా రోటరీ క్లబ్ వారు బహుమతులు ప్రధానం చేశారు. ఈ బహుమతుల ప్రదానోత్సవంలో రోటరీ క్లబ్ సభ్యులు విద్యా సాగర్, విశ్వ ప్రసాద్, పీఈటీలు అరె తిరుపతి, మంచాల కిషన్ పాల్గొన్నారు.