SRD: గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని ట్రాన్స్ కో ఏఈ స్వామి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో బస్తీబాట కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలైనా నేరుగా మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.