KMR: భిక్నూర్ PHCలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగిందని డా. దివ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. దివ్య మాట్లాడుతూ.. ప్రతినెల 9వ తేదీన ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రాలు గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన సమగ్రమైన అలాగే ప్రసవానంతరం సంరక్షణను ఉచితంగా అందిస్తామన్నారు.