NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల మార్గదర్శకత్వంలో “నారిశక్తి” కార్యక్రమం నిన్న ప్రభావవంతంగా కొనసాగింది. మహిళా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి, డయల్ 100 కాల్స్‌కు స్పందించారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించినట్లు గురువారం ఎస్పీ కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.