VZM: అనర్హుల పేరిట దివ్యాంగుల పింఛన్లు తొలగించడం ప్రభుత్వానికి సరి కాదని ఏపీ దళితకూలి రైతు సంఘం నాయకుడు డి. కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వేపాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మండలంలో 757 దివ్యాంగు పింఛన్లు ఉండగా అందులో అనర్హత పేరిట 259 పింఛన్లు తొలగిస్తామంటూ నోటీసులు ఇవ్వడం తగదు అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారయ్య, ఎర్రి బాబు, విజయ్ పాల్గొన్నారు.