• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుంతలు పడ్డ రోడ్డుకు తాత్కాలిక పరిష్కారం

SDPT: సామాజిక సేవకు చిన్న, పెద్ద తేడా లేదని, పదవితో పనిలేదని మంచి మనస్సుతో ముందడుగు వేస్తే ప్రజల కష్టాలు తీర్చవచ్చని ముందుకు వచ్చి మరోసారి నిరూపించారు బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య. అత్యవసరం ఉన్న ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచే ఆయన తాజాగా మానవీయ కోణాన్ని చాటుకున్నారు.

August 20, 2025 / 06:21 PM IST

సీఎం పర్యటన వాయిదా… నిరాశలో ఆదివాసీలు

BDK: సీఎం బెండాలపాడు పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా తాము ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరుతోందని, తాము గృహ ప్రవేశం చేయబోతున్నామని కొండంత అశతో ఉన్న ఆదివాసీలు నిరాశకు గురయ్యారు.సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు,అధికారుల హడావుడితో వారం రోజులుగా గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. కానీ ఆయన పర్యటన వాయిదా తో స్తబ్దత ఏర్పడింది.

August 20, 2025 / 06:21 PM IST

‘YVU అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలి’

KDP: యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలని RSF రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరు SCNR ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థులతో కలిసి ఆయన కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. YVUలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, లా, బి.ఎడ్ కోర్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు.ఆగిన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని తెలిపారు.

August 20, 2025 / 06:20 PM IST

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

AKP: ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం పేర్కొన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలతో జరిగిన సమీక్షలో ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలని, ఇంటి స్థల దరఖాస్తులు, భూ సర్వే, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

August 20, 2025 / 06:18 PM IST

వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

W.G: వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు నిషేధించామన్నారు

August 20, 2025 / 06:18 PM IST

విజయవాడకు వెళ్లిన కాకాణి

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాలో ఉండకూడదని న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన ఆయన విజయవాడకు వెళ్లారు. ఈ మేరకు అక్కడ ఆయనను మనుబోలు వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలు, అభిమానులు ఎవరూ అధైర్య పడవద్దని, వచ్చే రోజులు తమవేనని ఆయన ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక రాజకీయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

August 20, 2025 / 06:16 PM IST

ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యసాధనలో బ్యాంకర్ సహకరించాలి

KNR : వివిధ ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో ఆర్థిక పరమైన అంశాల్లో బ్యాంకర్‌లు సహకరించాలని, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్‌లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బీసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సమావేశం నిర్వహించారు.

August 20, 2025 / 06:16 PM IST

‘దోమల కాటు వల్లే వ్యాధులు వస్తాయి’

CTR: ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరపాలక సంస్థ 8వ వార్డు వెంగళరావు కాలనీలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ DMHO డా.వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. దోమ కాటు వల్లే ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తాయని, శుభ్రతతో నివారించవచ్చన్నారు. అనంతరం ఫాగింగ్, స్ప్రేయింగ్, ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టారు.

August 20, 2025 / 06:15 PM IST

రుణ సమస్యపై న్యాయం కోరుతున్న మహిళలు

ASR: కించుమండ గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘ మహిళలు తీసుకున్న రుణం పూర్తిగా తీర్చినట్టు ఉన్నప్పటికీ, బ్యాంకు అధికారులు అప్పు మిగిలి ఉన్నట్లు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఖాతాల్ని నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గత నెల 18న మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు.

August 20, 2025 / 06:14 PM IST

జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులతో బుధవారం జూమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.పెండింగ్ కేసులు, POCSO కేసుల్లో త్వరగా చార్జ్‌షీట్‌లు దాఖలు చేయాలని, ప్రజావాణి/CCC పిటిషన్లు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి కోసం తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

August 20, 2025 / 06:12 PM IST

దోమల నియంత్రణతో వ్యాధుల నిర్మూలన

KDP: దోమల నిర్మూలనతోనే వ్యాధులను నియంత్రించవచ్చునని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సిద్ధవటంలోని నలంద పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమల వ్యాప్తి ద్వారా కలిగే ఆరోగ్య ప్రమాదాలను గుర్తిస్తూ, ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

August 20, 2025 / 06:12 PM IST

‘ఆలయ నిర్మాణానికి సహకరించండి’

KNR: తిమ్మాపూర్‌లో ఆర్యవైశ్య కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి సహకరించాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాతను మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమెను కలిసి వినతిపత్రం అందించారు. నీరుమల్ల శ్రీధర్, నగునూరి మధుసూదన్, చిట్టుమల్ల శ్రీనివాస్, చందా ప్రవీణ్, చందా ప్రశాంత్, తదితరులు ఉన్నారు.

August 20, 2025 / 06:11 PM IST

పేదలకు ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం

NDL: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం మండల నాయకులు మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూరు మండలం తాహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి 18 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఇళ్లు, స్థలాలు, నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

August 20, 2025 / 06:11 PM IST

‘బ్రిడ్జి నిర్మించకపోతే ఉద్యమిస్తాం’

NGKL: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కేసరి సముద్రం అలుగు పారుతోంది. ఈ సందర్భంగా అలుగు ప్రాంతాన్ని BJP పట్టణ అధ్యక్షుడు చావా ప్రమోద్ కుమార్ సందర్శించారు. ఏటా వర్షాకాలంలో అలుగు పారడంతో ఎండబెట్ల, ఐతోలు, సిర్సవాడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ధర్నా దిగుతామని తెలిపారు.

August 20, 2025 / 06:08 PM IST

MRO ముందు పాత నేరస్తుల బైండొవర్

MNCL: బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం MRO ముందు బైండోవర్ చేయించడం జరిగిందని SI కిరణ్ కుమార్ తెలిపారు. గత సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలకు కారణమై కేసులు అయిన వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. మరొసారి అలా చేయకుండా బైండ్ ఓవర్ చేశామన్నారు.

August 20, 2025 / 06:07 PM IST