VZM: మున్సిపల్ కార్పొరేషన్ ఆధినంలో ఉన్న దుకాణాల అద్దె బకాయిలను ఏమాత్రం ఉపేక్షించబోయేది లేదని సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన నగరంలోని పలు దుకాణాల వద్దకు వెళ్లి అద్దెలను రాబట్టారు. కొందరు కొంత సమయం కావాలని కోరగా కాల పరిమితిలోగా అద్దెలు చెల్లించాలని లేనియెడల దుకాణాలను మూసివేస్తామని హెచ్చరించారు.