WGL: పట్టణ కేంద్రంలో APRIL 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ బైక్ ర్యాలీ రంగశాయిపేట మహంకాళి ఆలయం నుంచి HNK జిల్లా బాలసముద్రం వరకు జరగనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బడ్జెట్ పై చర్చించి ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల వసూలుతో వచ్చే నిధులను ప్రతిపాదిత పనులకు వినియోగించాలన్నారు.
KRNL: ఆలూరులో ఏఐటీయూసీ జిల్లా 21వ మహాసభలు ఇవాళ అట్టహాసంగా నిర్వహించారు. వేలాది కార్మికులతో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.
GDWL: కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను శనివారం పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శ్రీనివాసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అట్రాసిటీ కేసుల పురోగతిపై SP సతీష్ కుమార్ కమిటీకి వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యేక ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఆర్టీఓ కరుణాసాగర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఏలూరు శాంతినగర్‌లో రోడ్లు, డ్రైన్లను పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి నగరంలో అపరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రైన్లలో మురుగునీరు నిలిచిపోవడాన్ని గుర్తించి, సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
TG: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్ 2’ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సినిమాపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా సమాజంలో విభజనను పెంచుతోందని మండిపడ్డారు. ఈ చిత్రంలోని సంభాషణలు కేవలం హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది బక్వాస్ సినిమా అని అన్నారు.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRHకు బిగ్ షాక్ తగిలింది. 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి (1) క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు ఒకే ఓవర్‌లో అభిషేక్ (7), ట్రావిస్ హెడ్ (11)ను డఫీ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం SRH 5 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (23*), క్లాసెన్ (3*) పరుగులతో క్రీజులో ఉన్నారు. హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీష్ కుమార్ రెడ్డి (1) రన్స్ చేశారు. RCB బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీశాడు.
E.G: జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాలకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.
ASR: హుకుంపేట స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలోని వారపు సంత వేలంపాట ఏప్రిల్ 1 (బుధవారం) ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు సర్పంచ్ సమీడ వెంకట పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు, యువత రెండు రోజుల ముందుగానే రూ.5,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
SRPT: హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవ్వాళ విద్యుత్ శాఖ ఏఈ రాంప్రసాద్‌తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల కౌన్సిలర్లు తమ పరిధిలోని విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వార్డుల్లో అడ్డంకిగా ఉన్న మిడిల్ పోల్స్ తొలగించాలని కోరారు.
AP: అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నేరవేర్చిందని తెలిపారు. అసెంబ్లీకి గైర్హాజరుతో వైసీపీ కుట్ర బయటపడిందన్నారు. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. 11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాని వైసీపీకి రాజకీయపార్టీగా ఉండే అర్హత లేదని పేర్కొన్నారు.
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి శనివారం ఒక్కరోజే రూ. 21,98,308 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ప్రసాద విక్రయాలకు రూ. 8,07,150 రాగా, కార్ పార్కింగ్ రూ. 2,82,500, VIP దర్శనాల ద్వారా రూ. 2,25,000 ఆదాయం వచ్చినట్లు వివరించారు. అలాగే బ్రేక్ దర్శనాలు, వ్రతాలు, ఇతర సేవల విభాగాల నుంచి భారీగా నిధులు సమకూరాయని అధికారులు తెలిపారు.
ADB: తాంసీ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి శనివారం మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని రాజకీయ చర్చలను ఆయనకు వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలనీ కేటీఆర్ అన్నారు.