NZB: వర్ని మండలానికి చెందిన 108 అంబులెన్స్‌ను జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని మందుల నిల్వలు, వైద్య పరికరాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, అత్యవసర సమయాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
SRCL: RAMP ప్రాజెక్ట్ క్రింద ఎల్లారెడ్డిపేట ఐటీఐ కాలేజీలో ఒక రోజు ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ టి. హనుమంతు పాల్గొని, MSMEలకు ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వివరించారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.
TPT: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారాముల కల్యాణం, 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
E.G: కడియం మండలం కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్, ఉద్యాన శాఖ సంయుక్తంగా గురువారం అలంకరణ మొక్కల ఎగుమతులు, సంబంధిత విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై మాట్లాడుతూ కడియం నర్సరీల నుంచి మొక్కలను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని సూచించారు.
PLD: జిల్లాలో జరగనున్న 16వ జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జేసీ సంజన సింహ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మార్చి 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో పాల్గొనే అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కృష్ణా: చల్లపల్లిలో వడ్రంగి దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేకల డొంక వద్ద ఉన్న ఉడ్ వర్క్ టింబర్ డిపోలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని అద్దంకి సత్యనారాయణకు రూ.10లక్షల మేరకు నష్టం వాటిల్లింది. ఘటన స్థలికి పోలీస్, ఫైర్ సిబ్బంది, స్థానికులు చేరుకుని మంటలు అదుపు చేశారు.
KMM: వ్యవసాయాన్ని కాపాడండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో వ్యవసాయక విప్లవానికి ప్రజలు సిద్ధం కావాలని AIKMS జాతీయ అధ్యక్షుడు వెంకట్రామయ్య పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జాతీయ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకువస్తున్న వీబీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తునట్లు పేర్కొన్నారు.
BDK: భక్తులకు తాగునీరు, ఇతర సౌకర్యాల్లో ఎలాంటి లోటు రానీయొద్దని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. గురువారం ఆయన స్థానిక మిథిలా స్టేడియంతో పాటు ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేడుకల అనంతరం ప్రసాదం, తలంబ్రాల పంపిణీ సజావుగా సాగేలా చూడాలని సూచించారు.
JN: వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ ఇవాళ నియమించింది. ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ఆలయ ఈఓ సాల్వాది మోహన్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన కొత్త బస్ రూట్లను, బస్ స్టాపులను మంజూరు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. అలాగే ఇప్పటికే ఉన్న బస్టాండ్లను ఆధునీకరించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చాలని విన్నవించారు. ఈ మేరకు అసెంబ్లీ హల్‌లో మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.
శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా త్రేతా యుగంలో భూమి మీద చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశిలో జన్మించాడు. ఆయన మరల చైత్ర శుద్ధ నవమి రోజున సీతామాతను వివాహమాడాడని రామాయణం చెబుతోంది. అప్పటి నుంచి చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీ రామనవమి పండుగగా జరుపుకొంటూ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవాన్ని వాడవాడలా చేస్తున్నారు.
కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో జనాభా గణన–2027 (దశ-1)కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్ రాకేష్ చంద్ర ప్రారంభించారు. గణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఫీల్డ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించి, ఎలాంటి లోపాలు లేకుండా డేటా సేకరణ జరగాలని ఆదేశించారు.
NLR: మల్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 13 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సుమారు15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.మంత్రి స్పందిస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
PDPL: రామగుండం సింగరేణి RG-2 ఏరియా పరిధిలోని OC-3 ప్రాజెక్టు 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఓవర్ బర్డెన్ మట్టి వెలికి తీయడంలో రికార్డు సృష్టించింది. మార్చి 24న ఒక్క రోజే 2,42,177 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీసినట్లు GM బండి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అధికారులను ఆయన అభినందించారు.
బావమరదళ్ల ప్రేమకథతో వచ్చిన సినిమా ‘బ్యాండ్ మేళం’. మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించాలనుకునే యాదగిరి(రోషన్).. తన మరదలు రాజి(శ్రీదేవి) ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేది ఈ మూవీ కథ. నటీనటుల ప్రతిభ, అక్కడక్కడా పండిన కామెడీ, సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. అయితే.. రొటీన్ కథ, భావోద్వేగాలు పండకపోవడం, సాగదీత సీన్లు బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2.25/5.