W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013’ నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు.
NRML: నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, సేవల నాణ్యతను పెంచాలని అధికారులకు సూచించారు.
TG: దేశంలోని మెట్రో నగరాలన్నింటిని వెనక్కి నెట్టి ‘నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరం’గా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ సంస్థ అన్‌బాక్సింగ్ BLR విడుదల చేసిన ‘WeAreCity 2026’ నివేదికలో ఆఫీస్ స్పేస్ అద్దె విషయానికి వస్తే.. బెంగళూరుకు హైదరాబాద్ కేవలం 15 శాతం దూరంలోనే ఉంది. కొత్త కంపెనీల ఏర్పాటులో బెంగళూరుతో హైదరాబాద్ సమంగా నిలవడం విశేషం.
SRPT: రాబోయే వానాకాలం సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కోదాడ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ తిరుపతమ్మ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన నడిగూడెం కోపరేటివ్ బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సొసైటీల ద్వారా యూరియా, జింక్, ఇతర వ్యవసాయ పనిముట్లు రైతులకు సకాలంలో అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
వనపర్తిలో బాలికపై అత్యాచార ఘటనపై న్యాయం కోరిన నందిమల్ల అశోక్, చీర్ల చందర్ సహా ఆరుగురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. నిందితుడిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
GNTR: ఫిరంగిపురంలో మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల గోదాంను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్, తమీమ్ అన్సారియా పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక సదుపాయాలు తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణం గోనిపెంట రోడ్డులో ఉన్న హజరత్ మొహమ్మద్ కమ్రుద్దీన్ బాబా దర్గా శుక్రవారం ఘనంగా గంధం మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని పెనుకొండలో హిందూపురం ఎంపీ పార్థసారథిని మైనారిటీ సోదరులు కలసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దర్గా ఉత్సవానికి హాజరై ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎంపీని కోరారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం బాధితులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పథకం ద్వారా పేద మొదటి తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
AP: పాలకోసం ఏడ్చిన చిన్నారిని కన్నతల్లే కడతేర్చిన హృదయవిదారక ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. తమిళనాడు నుంచి ఉపాధి కోసం సత్యవేడుకు వచ్చిన దంపతులకు ఓ కుమారుడు, ఆరు నెలల కూతురు ఉన్నారు. అయితే తల్లి పనిలో ఉండగా.. చిన్నారి పాల కోసం గుక్కపట్టి ఏడ్చింది. దీంతో అసహనానికి గురైన ఆ తల్లి ఆ పసికందు గొంతు నులిమేయడంతో విగతజీవిగా మారింది. ఈ ఘటన అందరి హృదయాలను కలచివేసింది.
MDK: రామాయంపేట మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ మార్పు చోటుచేసుకుంది. 2వ వార్డు కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో, మున్సిపల్ ఛైర్‌పర్సన్, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
NDL: ఆళ్లగడ్డలోని టీఎస్ ఫంక్షన్ హాల్‌లో APWJF, APUWJ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా అపుస్మా డివిజన్ అధ్యక్షుడు అమీర్ బాషా, రవీంద్ర చారి దంపతులు, మహిళా శిల్పి భువన పాల్గొని సరుకులు అందజేశారు. వారు మాట్లాడుతూ.. మీడియా సేవలు సమాజానికి ఎంతో ముఖ్యమని అన్నారు.
BHPL: రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో SI సుధాకర్ ఆధ్వర్యంలో “ARRIVE- ALIVE ” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI సుధాకర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
KRNL: హాలహర్వి మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని మొత్తం 14 మందికి రూ. 6,84,487 విలువైన చెక్కులు అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇంఛార్జ్ పేర్కొన్నారు.
ATP: గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు వరుసగా మూడు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగా గౌరి ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ షాపుల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దుకాణాల్లో ఉన్న నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
RR: గుడిమల్కాపూర్ మార్కెట్‌ను, చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్‌కు తరలించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరారు. అజీజ్ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే చేవెళ్ల నియోజకవర్గంలో శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, నవాబ్ పేట్ మండలాల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.