BPT: మార్టూరు మండలంలోని ద్రోణాదుల గ్రామంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇవాళ పర్యటించారు. గ్రామంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.