NZB: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి కల్పించిన మహోన్నత వ్యక్తి పటేల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యోగేశ్వర్ గౌడ్, గణేష్, శివ కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.