WNP: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్సై స్వాతి అన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా శుక్రవారం రన్ ఫర్ యూనిటీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అమరచింత పోలీసుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ చౌరస్తా నుంచి పురవీధుల గుండా పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.