AKP: వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్యం లోపం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీపీవో సందీప్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం పాయకరావుపేటలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి క్లోరినేషన్ చేయాలన్నారు.