TPT: తిరుపతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాలు ఉన్నవారు నవంబర్ 5 లోపు ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జ్ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు సచివాలయంలో EKYC చేసుకొని గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి మారాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 37 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.